Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌కు రామ్ చరణ్‌కు మద్య కోల్డ్ వార్ జరుగుతుందని కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇద్దరు మాత్రం స్నేహితులుగా కనిపిస్తారు. బయటకు ఎలా కనిపించినా కూడా లో లోపల మాత్రం అల్లు అర్జున్‌కు చరణ్‌పై అసూయగా ఉంటుందని స్వయంగా మెగా ఫ్యాన్స్ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా అభిమానంను కనబర్చే అల్లు అర్జున్ ఆయన వారసుడు చరణ్‌పై మాత్రం అసూయను కలిగి ఉంటాడనేది అందరు అనుకునే విషయం. చిరంజీవికి అసలైన వారసుడిని నేనే అని బన్నీ అభిప్రాయం. కాని చరణ్‌ను చిరు వారసుడు అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం.
ఆ మధ్య చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ చిత్రం భారీ వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం వసూళ్లను అల్లు అర్జున్ ‘డీజే’ చిత్రంతో బ్రేక్ చేశాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చిన్న ప్రకటన చేయడం జరిగింది. దాంతో చిరంజీవి రికార్డును బ్రేక్ చేసేంతటి సత్తా బన్నీకి ఉందా, లేనిపోని ప్రచారాలు మానాలని, చిరంజీవిని మించిన కలెక్షన్స్ అంటూ ప్రచారం చేస్తే సినిమాను బహిష్కరిస్తాం అంటూ మెగా ఫ్యాన్స్ దిల్‌రాజుకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతో ఆ కలెక్షన్స్ ప్రచారం చేయలేదు. అయితే తాజాగా చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం కలెక్షన్స్ విషయంలో స్వయంగా మెగా ఫ్యాన్స్ దుమ్ము దుమ్ముగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి ఖైదీ నెం.150 రికార్డును కేవలం 15 రోజుల్లో చరణ్ బ్రేక్ చేశాడని, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు అంటూ విశ్లేషకులు కూడా అంటున్నారు. దాంతో బన్నీకి మరోసారి కడుపు మండుతోందని సమాచారం అందుతుంది. తన సినిమా కలెక్షన్స్ చెప్పినప్పుడు చిరంజీవికి కంటే నువ్వు ఎక్కువ సాధించావా అంటూ ప్రశ్నించిన వారు ఇప్పుడు రంగస్థలం కలెక్షన్స్‌ను దగ్గరుండి మరీ పబ్లిసిటీ చేయడం ఆయన మనసుకు బాధను కలిగిస్తుందని సమాచారం అందుతుంది.