5 నిమిషాల్లోనే సెటిలైన బన్నీ పెళ్ళి

5 నిమిషాల్లోనే సెటిలైన బన్నీ పెళ్ళి

ప్రస్తుతానికి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరంచేసుకొని, చిత్ర పరిశ్రమలో టాప్ లో ఒకరిగా దూసుకపోతున్నటువంటి అల్లు అర్జున్ గతంలో తన ప్రియురాలు స్నేహ రెడ్డి ని కులాంతర వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ప్రస్తుతానికి వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఆ విషయం ఇప్పుడెందుకు వచ్చిందంటే… ఈ కులాంతర వివాహానికి బన్నీ వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారా… అసలు బన్నీ తన ప్రేమ విషయమై వారి దగ్గర ప్రస్తావించినప్పుడు బన్నీ తల్లిదండ్రుల స్పందన ఏంటి అనే విషయమై తాజాగా ఒక ప్రైవేట్ మీడియా కి బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

కాగా బన్నీ పెళ్ళికి సంబంధించి కేవలం 5 నిమిషాల్లోనే అంత సెటిల్ అయ్యిందని వెల్లడించారు. కాగా బన్నీ తన ప్రేమ విషయాన్నీ ముందుగా తల్లి నిర్మలకు చెప్పుకున్నాడని, ఆ తరువాతే తనకు తెలిసిందని చెప్పారు. ఇక బన్నీ వచ్చి స్నేహ రెడ్డి ని చేసుకుంటాను అని చెప్పగానే… “నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, మేం చుసిన అమ్మాయిని చేసుకున్న కూడా, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండటం కంటే మాకు కావాల్సింది ఇంకా వేరే ఏంముందని చెప్పారని” అల్లు అరవింద్ వివరించారు. అలా బన్నీ పెళ్లి జరిగిందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.