మహానుభావుడితో మారుతికి రెండు పిలుపులు.

Allu Arjun movie offer to Director Maruthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వరసగా హిట్లు కొడుతున్నప్పటికీ పెద్ద హీరోల నుంచి పిలుపు రావడం లేదే అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న దర్శకుడు మారుతి. మహానుభావుడు హిట్ తర్వాతా అదే పరిస్థితి ఎదురు అవుతుందేమో అని మారుతి కూడా అనుకున్నారు. కానీ ఆయన నిరీక్షణ ఫలిచేట్టు వుంది. మారుతి ఓ పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మారుతి కంటెంట్ కి పడిపోయిన బన్నీ మంచి స్టోరీతో వస్తే సినిమా ఇస్తానని మాటిచ్చినట్టు తెలుస్తోంది.

ఆ ఖుషీలో ఉండగానే మారుతికి ఇంకో పిలుపు అందింది. అది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు నుంచి అట. మహానుభావుడు సినిమా చూసిన ఆయన స్వయంగా మారుతికి ఫోన్ చేసి పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపాడట. పైగా సినిమాని డీల్ చేసిన విధానం, సీన్స్ తో సహా చెప్పి ఆశ్చర్యపరిచారట. మొత్తానికి మహానుభావుడు దర్శకుడు మారుతికి బిగ్ బ్రేక్ ఇచ్చేలా వుంది.