బన్నీ ఐకాన్ కనబడుటలేదట !

Allu Arjun Teaches Lesson Of Garu At Sharwanand Event

‘నా పేరు సూర్య’ తరువాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయాలని నిర్ణయించుకుని ఆ విధంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత తను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేత్శున్నట్టు ప్రకటించాడు సుకుమార్. అయితే ఇక నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా, నేడు మెగా అభిమానులకు డబుల్ బొనాంజా దక్కింది. ‘ఎంసీఏ’తో హిట్ కొట్టిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా బన్నీ మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాకు ‘ఐకాన్ – కనబడుటలేదు’ అన్న ఆసక్తికర టైటిల్ ను పెట్టి, టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో అధికారికంగా బన్నీ ఈ సంవత్సరం మూడు సినిమాలను ప్రకటించినట్టు. ఈ కొత్త టైటిల్ రివీల్ తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.