మొదటి నుండి అనుకుంటున్నదే..!

allu arjun naa peru surya naa illu india movie shooting begin

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాను మెగా హీరో ప్రకటించాడు. తాజాగా ఆ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. పలు చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించబోతున్నట్లుగా చాలా నెలల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. నాగబాబు మరియు లగడపాటి శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ చిత్రానికి మొదటి నుండి కూడా ‘నాపేరు సూర్య’(నా ఇల్లు ఇండియా) అనే టైటిల్‌ ప్రచారం జరిగింది. అన్నట్లుగానే నేడు టైటిల్‌ను అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి ఇదే సంవత్సరం చివర్లో విడుదల చేయాలని వక్కంతం వంశీ భావిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. బన్నీ ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ చిత్రంలో కనిపించనున్నాడని మెగా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.