ఎట్టకేలకు బన్నీని ఒప్పించాడు

allu arjun next movie with director maruthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌తో సినిమా చేయాలి అంటే దర్శకుకు ఫేం ఉండాలి. మంచి ప్రతిభ ఉన్న దర్శకులను మాత్రమే బన్నీ ఎంపిక చేసుకుంటాడు. బన్నీ ఎంపిక చేసుకునే కథలు మరియు దర్శకులు ఆయన స్థాయిని పెంచుతున్నాయి. ఏ కథను పడితే దాన్ని చేయకుండా, ఎవరితో పడితే వారితో సినిమాలు చేయకుండా బన్నీ ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకోడం వల్లే ఇప్పుడు స్టార్‌ హీరోగా నిలదొక్కుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీకి దర్శకుడు మారుతి ఆప్త మిత్రుడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ చనువుతో ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రానికి ముందు బన్నీని మారుతి ఒక సినిమా చేద్దాం అంటూ కోరాడు. ఆ సమయంలో మొహమాటం లేకుండా ఇంకా కొన్ని సినిమాలు చేయి, ఆ తర్వాత చూద్దాం అన్నాడట.

ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’ చిత్రాలతో మారుతి వరుసగా బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు దక్కించుకున్నాడు. తాజాగా దసరా కానుకగా విడుదలైన ‘మహానుభావుడు’ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు, ఈయన కోసం స్టార్‌ హీరోలు సైతం డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్‌ కూడా మారుతితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మారుతితో ఈ విషయమై స్వయంగా అల్లు అర్జున్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మారుతికి అల్లు అర్జున్‌ నుండి పిలుపు రావడం పెద్ద ఆశ్చర్యంగా ఏమీ అనిపించకపోవచ్చు. కాని బన్నీతో సినిమా చేయాలని మారుతి దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఇప్పటికి సాధ్యం కాబోతుంది. త్వరలోనే బన్నీ కోసం మారుతి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ అనే చిత్రాన్ని చేస్తున్న బన్నీ ఆ తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మారుతితో సినిమాను బన్నీ చేయబోతున్నాడు. ఈ గ్యాప్‌లో మారుతి తన తర్వాత సినిమాను నాగచైతన్యనతో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే నాగచైతన్య కోసం మారుతి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు.