బన్నీ నిజమేనా, రచ్చ చేస్తావా?

Allu Arjun next movie with Sampath Nandi direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ చిత్రంతో రెడీ అవుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. బన్నీ ఆ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా గురించి సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో గత కొంత కాలంగా విపరీతంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా మరో వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో బన్నీ ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడని, ఆయన చెప్పిన కథ నచ్చడంతో బన్నీ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ సోషల్‌ మీడియా కబురు అందుతుంది.

రామ్‌ చరణ్‌తో ‘రచ్చ’ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంపత్‌ నంది ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం చేసే అవకాశంను దక్కించుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి సంపత్‌ను పవన్‌ తొలగించాడు. ఆ వెంటనే రవితేజతో సంపత్‌ నంది ‘బెంగాల్‌ టైగర్‌’ అంటూ ఒక చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అది సోసోగానే ఆడటం, ఆ తర్వాత తెరకెక్కించిన గోపీచంద్‌ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో సంపత్‌ నందికి అవకాశాలు రావడం లేదు. ఈ సమయంలో అల్లు అర్జున్‌ నుండి సంపత్‌ నందికి పిలుపు రావడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. వరుసగా రెండు చిత్రాలతో ఫ్లాప్‌ అయిన సంపత్‌ నంది మళ్లీ ఎలా రచ్చ చేస్తాడని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు అంటూ సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంపత్‌ నందితో అల్లు అర్జున్‌ మూవీపై అధికారిక క్లారిటీ త్వరలో వచ్చే అవకాశం ఉంది.