బన్నీ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా…?

Allu Arjun Next Movie With The Trivikram Srinivas

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర నిరాశ పరిచాడు. వరుస సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్న బన్నీకి ‘నా పేరు సూర్య’ చిత్రం ఒక విధంగా చాలా మైనస్‌ అయ్యిందని చెప్పవచ్చు. దాంతో బన్నీ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. గతంలో తాను చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా కొంత సమయం తీసుకున్నా పర్లేదు మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. బన్నీ విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు అని టాక్‌ వచ్చింది కానీ ఏమయిందో ఏమో బన్నీ విక్రమ్‌కు నో చెప్పాడు.

Two Heroes Are Waiting For Trivikram

 

ఈ సమయంలో బన్నీ చాలామంది దర్శకుల కథలు విన్నా కూడా అందరిని హోల్డ్‌లో పెట్టేశాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ వైపు చూస్తున్నాడు. త్రివిక్రమ్‌తో మరోసారి నటించాలని భావిస్తున్నాడు. వీరి కాంభోలో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలు వచ్చి మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాయి. దాంతో మరోసారి త్రివిక్రమ్‌తో చేసి హ్యాట్రిక్‌ కొట్టాలని బన్నీ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇటీవల పలు ఇంటర్య్వూలలో త్రివిక్రమ్‌ కూడా తన తదుపరి చిత్రాలు వెంకటేష్‌, మహేష్‌బాబు, బన్నీలతో ఉంటాయని చెప్పాడు.

allu-arjun

అయితే వెంకటేష్‌, మహేష్‌ బాబులు ప్రస్తుతం వేరే చిత్రాల్లో బిజీగా ఉన్నారు. బన్నీ ప్రస్తుతం వేరే దర్శకులకు ఒకే చెప్పలేదు కాబట్టి త్రివిక్రమ్‌ బన్నీతో చేసే అవకాశం ఉంది. కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్టు టాక్‌. ‘అరవింద సమేత’ ఫలితం కోసం ఎదురుచూసిన బన్నీ ప్రస్తుతం ఈ టాక్‌ను చూసి ఇక పక్కా త్రివిక్రమ్‌తో తదుపరి చిత్రాన్ని చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే వెంటనే బన్నీతో చేయడానికి త్రివిక్రమ్‌ సిద్దంగా ఉన్నాడా లేక వేరే ఏమైనా కొత్త ప్రాజెక్ట్‌ చేస్తాడా అనేది చూడాలి.

trivikram