నాని సభను స్వాదీనం చేసుకున్న బన్నీ..!

Allu Arjun Upcoming Movie Title Sabhaku Namaskaram

యువ హీరో నానితో దిల్‌రాజు వరుసగా రెండు చిత్రాలను నిర్మించాడు. ‘ఎంసీఏ’ చిత్రం మంచి విజయంను దక్కించుకున్న నేపథ్యంలో మరో చిత్రాన్ని కూడా నానితో నిర్మించేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేశాడు. నాని కోసం ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడంతో పాటు, అందుకోసం స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేయించాడు. తన టీంతో కథను రెడీ చేయించిన దిల్‌రాజు త్వరలోనే నానితో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే నానితో దిల్‌రాజు ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నాని వరుసగా వేరు వేరు ప్రాజెక్ట్‌లకు కమిట్‌ అయిన కారణంగా ఇప్పట్లో దిల్‌రాజు బ్యానర్‌కు డేటు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ‘సభకు నమస్కారం’ చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు.

మంచి మాస్‌ మసాలా ప్రాజెక్ట్‌ చేయాలని చాలా గట్టి పట్టుదలతో ఉన్న అల్లు అర్జున్‌కు ఈ సబ్జెక్ట్‌ బాగా నచ్చిందని, తప్పకుండా తనకు ఈ కథ యాప్ట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ కథకు ఎవరైతే న్యాయం చేయగరు అంటూ పలువురి దర్శకుల పేర్లను దిల్‌రాజు పరిశీలిస్తున్నాడు. ‘సభకు నమస్కారం’ స్క్రిప్ట్‌కు అల్లు అరవింద్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దాంతో విక్రమ్‌ కుమార్‌తో సినిమా కంటే ముందే బన్నీ ఈ చిత్రాన్ని చేస్తాడేమో చూడాలి. ఒకవేళ విక్రమ్‌ కుమార్‌ త్వరలో తీసుకు రాబోతున్న స్క్రిప్ట్‌ నచ్చితే వెంటనే విక్రమ్‌ కుమార్‌ సినిమాను చేసి, ఆ వెంటనే ‘సభకు నమస్కారం’ చిత్రాన్ని అల్లు అర్జున్‌ చేస్తాడని సమాచారం అందుతుంది. మొత్తానికి నాని చేయాలనుకున్న సభకు నమస్కారం చిత్రాన్ని అల్లు అర్జున్‌ చేయడం కన్ఫర్మ్‌ అయ్యింది.