శైలజారెడ్డి అల్లుడు టీజర్…

Shailaja Reddy Alludu Official Teaser

నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. నాగచైతన్య అత్తగా ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ మేరకు నిన్న విడుదల తేదీ పోస్టర్కు కూడా విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ సినిమా తీజర్ ని విడుదల చేసింది. తన సినిమాల్లో హీరో కి ఎదో ఒక జబ్బు లాంటిది పెట్టె మారుతి ఈ సినిమాలో మాత్రం ఆ జబ్బు హీరోయిన్ కి పెట్టాడు, యా జబ్బు పేరే ఈగో…అది ఎంత అంటే తను లవ్ చేస్తున్న అబ్బాయి దగ్గరకి వెళ్లి నువ్ నాకు ప్రొపోజ్ చేయి నేను ఓకే చేస్తానని చెప్పేంత. మొత్తానికి టీజర్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచుతుందనే చెప్పాలి.