మెగా బ్రహ్మోత్సవం లేదట!

Allu sirish There is no truth in making a film under Srikanth Addala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ను అందించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ‘బ్రహ్మోత్సవం’ అంటూ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనీసం రెండు రోజులు కూడా నిలువలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నట్టేట మునిగి పోయారు. కనీసం 10 శాతం కూడా వారు పెట్టిన పెట్టుబడి రికవరీ కాలేదు. ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమాల ఎంపిక మరియు దర్శకుల విషయంలో స్టార్‌ హీరోలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆ సినిమాతో అందరికి అనుభవం అయ్యింది. అలాంటి సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకు మళ్లీ ఆఫర్‌లు లేవు. ఈయనతో ఏ హీరో వర్క్‌ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.

ఈమద్య మెగా హీరో అల్లు శిరీష్‌కు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఒక కథ చెప్పాడని, ఆ కథ అల్లు ఫ్యామిలీకి నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. అల్లు బ్యానర్‌లోనే సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఆ వార్తలపై మెగా హీరో అల్లు శిరీష్‌ క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తాను సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు అలాంటి ప్రతిపాధన తన వద్దకు రాలేదని, అయితే గీతాఆర్ట్‌లో పలువురు దర్శకులకు అడ్వాన్స్‌లు ఇస్తూ ఉంటాం. ఆ దర్శకుల్లో శ్రీకాంత్‌ కూడా ఉన్నాడేమో అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో కూడా శ్రీకాంత్‌తో సినిమా ఉండదని క్లారిటీ ఇచ్చాడు.