అమరనాధుడి దర్శనం అందరికంటే ముందు మీకోసం.

amarnath-yatra-2017-details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమరనాధ్ యాత్ర ద్వారా మంచులింగ దర్శనానికి ముహూర్తం దగ్గరికి వచ్చింది. ఈ ఒక్క భాగ్యం దొరికితే చాలు జన్మంతా ధన్యమని భావించే వాళ్ళు కోకొల్లలు. ఈ ఏడాది జూన్ 29 నుంచి ఆగష్టు 7 వ తేదీ దాకా హిమ రూపం దాల్చిన కైలాసనాధుడ్ని దర్శించుకునే భాగ్యం భక్తులకి కలుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీ అమరనాధ్ యాత్ర బోర్డు ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్న భక్తుల సంఖ్యని బట్టి రోజుకి 7500 మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారట.

అయితే ఆ మంచు లింగాన్ని ప్రతి ఏటా తొలుత దర్శించుకునేది ఎవరో తెలుసా? సాక్షాత్తు భారత సైనికులు. ఔను నిజం. భక్తులకు అవసరమైన మార్గం, అందులో వున్న ఇబ్బందులు చూసేందుకు అందరికన్నా ముందే సైనికులు అక్కడికి చేరుకుంటారు. ఏ భద్రతా పరమైన ఇబ్బందులు రాకుండా అమరనాధ్ మార్గాన్ని జల్లెడపడతారు. ఇక అమరనాధ్ గుహకి చేరుకొని ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి భక్తులకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. అలా ఈ ఏడాది అక్కడికి చేరుకున్న సైనికులు ఆ మంచు లింగాన్ని వీడియోగా తీసి తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. అలా సైనికులు పంపిన వీడియో మీ కోసం…