ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్‌లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్‌లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది.
ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్ అమెజాన్ మార్కెట్లో లోకల్ బ్రాండ్లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్‌కు ఎక్కువగా బలైందని వెల్లడించింది.
అమెజాన్‌కు సంబంధించిన బ్రాండ్లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్లనే వినియోగదారులకు టాప్ సెర్చ్‌లో చూపిస్తోందనేది చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం. మరి అమెజాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.