ట్రంప్ తీరు మారదు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షులందరిలోకీ ఎక్కువ అన్ పాపులర్ అధ్యక్షుడిగా రికార్డు మూటగట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు రోజురోజుకీ తన స్థాయి దిగజార్చుకుంటున్నారు. అమెరికన్లందరూ తమ అధ్యక్షుడి పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ట్రంప్ వర్జీనియా గొడవపై స్పందించిన తీరు అందరికీ కోపం తెప్పించింది.

వైట్ సుప్రిమసీపై తప్పు లేదన్న ట్రంప్ వ్యాఖ్యల కారణంగా.. ప్రెసిడెంట్ సలహా మండలే రద్దైంది. ప్రముఖ కంపెనీల సీఈవోలు ట్రంప్ కు గుడ్ బై చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. గొడవకు వైట్స్ ఎంత కారణమో.. నాన్ వైట్స్ కూడా అంతే కారణమని ఆయన చెబుతున్నారు. అసలు వైట్స్ గొడవ రాజేయకుండా ఉండాల్సిందనే మాట మాత్రం చెప్పడం లేదు.

ట్రంప్ వైఖరి కారణంగానే అమెరికా కూడా అంతర్జాతీయంగా పలచనైపోయింది. గతంలో అమెరికాను విమర్శించాలంటే ఆచితూచి స్పందిచే దేశాలు కూడా ట్రంప్ అధ్యక్షుడయ్యాక చాలా ఈజీగా తిట్టేస్తున్నాయి. ప్రపంచ ప్రముఖ సమావేశాల్లో కూడా అమెరికా అధ్యక్షుడ్ని సైడ్ చేస్తున్నారు. ఇది అమెరికన్లందరకీ బాథ కలిగిస్తోంది. ట్రంప్ ను అధ్యక్షుడ్ని చేసి తప్పుచేశామని బాథపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

మరిన్ని వార్తలు:

పైకి శాంతి.. లోపల యుద్ధం

గంగులతో ఉపయోగం లేదా..?

ప్రదీప్ శర్మ ఈజ్ బ్యాక్