అమిత్ షా కి కెసిఆర్ అవసరం బాగా తెలిసొచ్చింది.

Amith shah realised the role of Kcr for next collections

తెలంగాణాలో బీజేపీ ని బలపరిచే లక్ష్యంతో హైదరాబాద్ లో పార్టీ శ్రేణులు , rss ప్రముఖులతో మాట్లాడేందుకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండానే వెనుదిరిగారు. నిన్నగాక మొన్న ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రామ్ మాధవ్ తెరాస ని టార్గెట్ చేస్తూ బాగానే నోరు పారేసుకున్నారు. అది చూసి ఇక అమిత్ షా ఏ రేంజ్ లో రెచ్చిపోతారో అనుకుంటే మొత్తానికి తుస్ అనిపించారు. దేశంలో ఎక్కడైనా బీజేపీ జెండా రెపరెపలు కనిపించాలని ఉవ్విళ్లూరుతున్న అమిత్ షా ఓ రాష్ట్రానికి పార్టీ పని మీద వచ్చి అక్కడ ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోవడం చిన్న విషయం ఏమీ కాదు. అంతా సవ్యంగా ఉంటే అమిత్ షా అందరూ ఊహించినట్టే మాట్లాడేవాళ్ళు.

కానీ 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కష్టమే , ఒకవేళ ఏర్పడే పరిస్థితి వస్తే మోడీ నాయకత్వం కొనసాగడం కూడా సందేహమే. ఈ విషయంలో అమిత్ షా , మోడీ ద్వయానికి ఈ మధ్యే క్లారిటీ పెరిగింది.అందుకే బీజేపీ మీద లెక్క లేకుండా మాట్లాడుతున్న బీహార్ సీఎం నితీష్ ని కూడా పాట్నా వెళ్లి మరీ పొత్తుకు ఒప్పించి వచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ ఇక్కడ తెరాస తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అయినా కాంగ్రెస్ తో యుద్ధం చేస్తున్న తెరాస అవసరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి చాలా వుంది.

ఈ విషయాన్ని గుర్తించి ఈ మధ్య మోడీ ఏ విషయంలో అయినా తెలంగాణ సీఎం కెసిఆర్ కి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కానీ హైదరాబాద్ లో స్థానిక బీజేపీ నాయకుల భాష వేరుగా ఉండటంతో జనాల్లో ఎక్కడో అయోమయం. అయితే హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కెసిఆర్ ని ఒక్క మాట కూడా అనకుండానే తిరిగి వెళ్లడం చూస్తుంటే తెరాస అవసరం గురించి కాషాయం హైకమాండ్ కి బాగానే క్లారిటీ వచ్చినట్టుంది. ఇకపై రామ్ మాధవ్ లాంటి ఇక్కడకి వచ్చి తెరాస మీద ఎంత తొడలు కొట్టి రెచ్చగొట్టినా పట్టించుకోవాల్సిన పనిలేదు అన్న మాట.