బిగ్‌బీ 50ఏళ్ల సినీప్రస్ధానం

బిగ్‌బీ 50ఏళ్ల సినీప్రస్ధానం

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్  హిందీ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తి చేసుకున్నారు. “సాథ్‌ హిందుస్తానీ” చిత్రంతో బాలీవుడ్‌లో 1969లో అడుగు పెట్టిన లెజెండరీ నటుడు అమితాబ్‌. 1969 నవంబర్‌ 7న బిగ్‌బీ మొదటిచిత్రం సాథ్‌ హిందుస్తానీ విడుదలై 50సంవత్సరాలు అయింది. తన నటనతో దేశ వ్యాప్తంగా దశాబ్దాల తరబడి సినీ ప్రియులను అలరిస్తూ సినీ అభిమానులను సంపాదించుకున్నారు. ఐదు దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న అమితాబ్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.

భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెంది ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తు సుదీర్ఘ సినీ పయనంలో పలు బ్లాక్‌ బస్టర్లు అందించిన అమితాబ్‌కి ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల మంచి స్పందన వస్తుంది.  బాలీవుడ్ లో  స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే  పేర్లతో అమితాబ్‌ ని పిలుచుకుంటారు.

నట వారసునిగా అమితాబ్ బచ్చన్  అభిషేక్ బచ్చన్‌ను సినిమా పరిశ్రమకు అందించారు. తండ్రి 50 ఏళ్ల సినీప్రస్ధానం సందర్భంగా అభిషేక్ బచ్చన్‌ తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సినీ 50ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలుపుతున్నారు.