అమ్మా…నాన్న…ఓ లవర్ తో కలిసి భర్తను చంపినా భార్య…!

Amma Daddy Wife Killed Her Husband With A Lover

వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోవడం, హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో షరా మామూలు అయ్యాయి. ఒక్కో ఘటనను చూస్తున్న వారు ప్రేరణ పొందుతున్నారో ఏమో గానీ భర్తలను హతమార్చడానికి మహిళలు అస్సలు వెనుకాడటం లేదు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఓ భార్య పథకం ప్రకారం ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. దీనికి భార్య తల్లిదండ్రులు, బంధువులు కూడా సహకరించిడం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామో తెలియచేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లాలోని సీకేదిన్నె మండలం ఏఎల్‌ కాలనీకి చెందిన రేఖరాణికి చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నక్కలపల్లె తాండా వాసి రవీంద్రనాయక్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది.

murder-husbend

అయితే ఇల్లరికం వచ్చిన రవీంద్రనాయక్‌ ఏఎల్ ఆటో నడపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హరినాయక్‌ అనే వ్యక్తితో రేఖ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం రవీంద్రనాయక్‌‌కు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మదనపల్లెకు వెళ్లిపోదామని భార్యను కోరితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక తన వివాహేతర సంబంధానికి అడ్డు రాకుండా ఉండేందుకు రేఖారాణి, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులు, బంధువులు కొందరు కలిసి అతడి హత్యకు ప్లాన్ చేశారు. దాని ప్రకారం సెప్టెంబరు 24 న రాత్రి 9 గంటల ప్రాంతంలో రవీంద్రనాయక్‌పై వీరందరూ దాడిచేసి కర్రలతో తలపై కొట్టారు. అనంతరం అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా చీరతో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది పోలీసులు ఘటనతో సంబంధం ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

murder