మల్టీ స్టారర్ లో రంగమ్మత్త

anasuya role in varun tej and venkatesh multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరి వెంకటేష్ తో కలిసి ఒక భారి మల్టి స్టారర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ కి జంటగా మేహ్రిన్ నటించనుండగా ,విక్టరి సరసన నటించే హీరోయిన్ కోసం గాలింపులు జరుగుతున్నాయి.ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అనసూయ నటించనుందని సమాచారం .అంతేకాదు ఈ పాత్ర కేవలం ఆమె కోసమే సృష్టించారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరపై పలు షో లకు యాంకర్ గా చేస్తు తనకంటూ ఒక క్రేజ్ ని దక్కించుకున్నవిషయం తెలిసిందే.అయితే ఆ క్రేజ్ తోనే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ కి ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుసపెట్టి మరి ఆఫర్లు వస్తున్నాయి.ఎఫ్ 2 టైటిల్ ని ఖరారు చేసిన ఈ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి రానున్నది. ఏదేమైనా అనసూయ కెరియర్లో రంగమ్మత్త పాత్ర తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.