పవన్‌ కోసం ఉదయ భాను రెడీ అయ్యింది

anchor-udaya-bhanu-going-will-do-item-song-pspk25-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ మరియు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన పవన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా భారీగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు త్రివిక్రమ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. విడుదల తేదీ కూడా ఫిక్స్‌ అయ్యింది.

త్రివిక్రమ్‌ సినిమా అంటే ప్రత్యేక పాఠ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాటను త్రివిక్రమ్‌ మాస్‌ ఆడియన్స్‌ కోసం పెట్టబోతున్నాడు. అయితే ఆ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ ముద్దుగుమ్మను లేదా టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌లను ఎంపిక చేయకుండా ఆంటీ అయిన హాట్‌ యాంకర్‌ ఉదయభానును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవ ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన ఉదయభానుతో ప్రత్యేక పాట విషయమై త్రివిక్రమ్‌ సంప్రదింపు జరిపినట్లుగా తెలుస్తోంది. ఉదయభాను అడగడమే ఆలస్యం వెంటనే ఓకే చెప్పేసింది.

గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జులాయి’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌ చేసింది. రానా హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రంలో కూడా ఉదయ భాను ఆడి పాడటం జరిగింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ అమ్మడు పవన్‌ సినిమాలో అవకాశం రావడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. పవన్‌ 25వ చిత్రం తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది