ప‌డ‌మ‌టి సంధ్యారాగం… ఆంధ్రా అబ్బాయి… అమెరికా అమ్మాయి

Andhra Boy marriage with America Girl in Guntur

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్క‌డ అమ్మాయి… ఇక్క‌డ అబ్బాయి ఒక్క‌ట‌య్యారు. ప్రేమ‌కు కుల‌, మ‌త‌, ప్రాంత‌, భాషా బేధాలుండ‌వ‌ని నిరూపించారు. ఎల్ల‌లు లేని ప్రేమ‌ను ఎల్ల‌లు దాటొచ్చి గెలిపించుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే… గుంటూరు జిల్లా వినుకొండ‌కు స‌మీపంలోని పొట్లూరుకు చెందిన రాము ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్క‌డే చ‌దువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో కాలేజ్ ఫంక్ష‌న్ లో లొరేనా అనే అమ్మాయి రాముకు ప‌రిచ‌య‌మ‌యింది. ఒకేర‌క‌మ‌యిన అభిప్రాయాలు కావ‌డంతో వారి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. ఆ స్నేహం క్ర‌మంగా వారిమ‌ధ్య అనురాగానికి దారితీసింది. అలా మూడేళ్ల పాటు ప్రేమించుకున్న రాము, లొరెనా పెళ్లితో ఒక్క‌టికావాల‌నుకున్నారు. కానీ మొద‌ట పెద్ద‌లు వారి ప్రేమ‌కు అడ్డుచెప్పారు. అయినా రాము ప‌ట్టువీడ‌క‌పోవ‌డం, లొరెనా మంచిమ‌న‌సు అర్ధంకావ‌డంతో చివ‌ర‌కు వారు అంగీక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఓ హోటల్ లో బంధుమిత్రుల స‌మ‌క్షంలో వేద‌మంత్రాల న‌డుమ హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వారి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.

లొరెనాది అమెరికా అయిన‌ప్ప‌టికీ అచ్చ తెలుగు అమ్మాయిలా ముస్తాబ‌యింది. లొరెనా తండ్రి పెళ్లికి రాలేక‌పోవ‌డంతో రాము మేన‌మ‌మ, మేన‌త్త ఆయ‌న స్థానంలో కాళ్లు క‌డిగి క‌న్యాదానం చేశారు. రాములోని క‌ష్టించే మ‌న‌స్త‌త్వం త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని, లొరెనా చెప్పింది. త‌మ మ‌ధ్య చాలా సారూప్య‌త‌లు ఉన్నాయ‌ని, అవే త‌మ‌ను క‌లిసి న‌డిచేలా చేశాయ‌ని తెలిపింది. భార‌తీయ ఆచారాలు, సంప్ర‌దాయాలు, కుటుంబ వ్య‌వ‌స్థ చాలా బాగున్నాయ‌ని, ముఖ్యంగా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఆప్యాయ‌త‌లు, ఇక్క‌డి ఆహారం త‌న‌కు చాలా న‌చ్చాయ‌ని చెప్పింది. అమెరికా ఆచారాలు వేరైనా తెలుగు నేల త‌న‌ను క‌ట్టిప‌డేసింద‌ని సంతోషం వ్య‌క్తంచేసింది. లొరెనా త‌న ప‌ట్ల చూపించే శ్ర‌ద్ధ‌, అనురాగం త‌న‌తో ప్రేమ‌లో ప‌డేశాయ‌ని రాము చెప్పాడు. త‌న త‌ల్లిదండ్రులు మొద‌ట వ‌ద్ద‌న్న‌ప్ప‌టికీ… లొరెనా మంచిత‌నం చూసి పెళ్లికి ఒప్పుకున్నార‌ని… ఇప్పుడు వారంతా సంతోషంగా ఉన్నార‌ని తెలిపాడు. మొత్తానికి తెలుగ‌బ్బాయి… తెల్ల‌మ్మాయిని పెళ్లిచేసుకుని నిజమైన ప్రేమ‌కు ఎలాంటి అడ్డంకులూ ఉండ‌వ‌ని నిరూపించాడు.