పెథాయ్ తుపాన్ హెచ్చ‌రిక…అల్లకల్లోలంగా సముద్రం…!

Andhra Coast Braces For Phethai Cyclone

కోస్తాంధ్రను చిగురుటాకులా వణికిస్తున్న పెథాయ్ తుపాను ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల లోపు తీరం దాటవచ్చని ప్రస్తుతానికి ఇది తీవ్ర తుపానుగానే ఉందని, 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, గాలుల వేగం మరింతగా పెరగవచ్చని తెలిపారు. ఈ మధ్యాహ్నానికి పెథాయ్ తీవ్ర తుపాను నుంచి కాస్తంత తీవ్రతను తగ్గించుకుని తుపాన్ గా మారవచ్చని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 9 మంది గర్భిణీ స్త్రీలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెథాయ్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు రైల్వే ట్రాకులను పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విపత్కర పరిస్థితులు ఏర్పడితే, ప్రయాణికులకు ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయని, తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బ‌ల‌మైన ఈదురు గాలులు గంట‌కు 110 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో వీస్తాయని, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో గంట‌కు 80 నుంచి 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ, తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడుతుందని ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలి, అర‌టి రైతులు, ఉద్యానవ‌న రైతులు జాగ్ర‌త్త‌ల్లో ఉండాలని వ‌రి, జొన్న‌, త‌దిత‌ర ధాన్యాల‌ను కోసిన‌వారు వాటిని త‌క్ష‌ణం గోదాముల్లో భ‌ద్ర‌ప‌రచాలని అధికారులు చేబుత్గున్నారు. ఒకవేళ పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ ప‌ట్ట‌లు క‌ప్పి భ‌ధ్ర‌ప‌ర‌చాలి, వ్య‌వ‌సాయ శాఖ అధికారుల నుంచి రైతులు ఇవి పొంద‌వ‌చ్చు, గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాస‌ముంటున్న వారిని వెంట‌నే పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాలని, లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలని, తుపాన్ తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దని, రోడ్ల‌పై వాహ‌నాల్లో తిర‌గ‌రాదని చెట్ల కింద త‌ల‌దాచుకోరాదని తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని అధికార్లు చెబుతున్నారు.