ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం

ఆంద్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మార్చేసి, విశాఖలో ఏర్పాటు చేస్తారని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సంబంధిత పనులు కూడా మొదలెట్టారని సమాచారం. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ విశాఖ కి కొన్ని వరాలు ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం ను ప్రకటించదానికి సిద్దమైన సీఎం జగన్ విశాఖ నగరాభివృద్ధికై కొన్ని వరాలని ప్రకటించారు. కాగా విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) పరిధిలో రోడ్లు, డ్రైనేజీ లు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ, వాటి కోసం నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను కూడా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈమేరకు అభివృద్ధికి సంబందించిన నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా 7 జీవోలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నెల 28 న విశాఖపట్నం ప్రాంతంలో పర్యటించనున్నారు. కాగా అక్కడ రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. మెల్లమెల్లగా విశాఖ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేయనున్నారని సమాచారం.