చిరంజీవి “గాడ్ ఫాథర్” కాంబినేషన్ పై లేటెస్ట్ బిగ్ అప్డేట్.!

Latest Big Update on Chiranjeevi “Godfather” Combination.!
Latest Big Update on Chiranjeevi “Godfather” Combination.!

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ తర్వాత చిరు మరోసారి “గాడ్ ఫాదర్” దర్శకుడు మోహన్ రాజా తో కలిసి వర్క్ చేయనున్నారు అని ఇంట్రెస్టింగ్ బజ్ రీసెంట్ గానే మొదలైంది. ఇక ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ కూడా వినిపిస్తున్నాయి.

Latest Big Update on Chiranjeevi “Godfather” Combination.!
Latest Big Update on Chiranjeevi “Godfather” Combination.!

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉందట. అలాగే ఈ రానున్న జూన్ మొదటి వారంలోనే మూవీ పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అందిస్తారని వినిపిస్తోంది. అంతే కాకుండా మూవీ రెగ్యులర్ షూట్ ఈ ఆగస్ట్ నుంచే మొదలు కానున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే పక్కా ప్లానింగ్ ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ వెళుతుంది అని చెప్పుకోవాలి . ఇక ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.