ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్

ఏపీ రాజధాని విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అవుతోంది. రైతులు తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర నేతలు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే రాయల సీమ నేతలు మాత్రం రాజధాని తమకే కావాలంటున్నారు. ఇందుకు వారు చెబుతున్న లాజిక్ కూడా ఉంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర అంతర్భాగంగా ఉన్నప్పుడు పాలన చెన్నై నుంచి సాగేది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధాని అయ్యింది. మళ్లీ ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఏపీకి అమరావతిని చంద్రబాబు చేశారు.

అయితే ఇప్పడు జగన్ విశాఖను రాజధానిగా చేస్తున్నారు. రాయలసీమ నేతల లాజిక్ ఏంటంటే.. విశాఖ వాళ్లు రాయలసీమకు రావడానికి దూరమైనపుడు.. మేం కూడా అక్కడికి వెళ్లడానికి దూరమవుతుంది. ఉత్తరాంధ్ర వాళ్లు ఏం కోరలేదు.. వాళ్లకి ఇస్తున్నారు. మేం ఎప్పుటి నుంచో కోరుతున్నాం కదా? ఇవ్వడానికి సమస్యేంటి? కర్నూలు రాజధానిని గతంలో త్యాగం చేశాం. అది అలా ఉండి ఉంటే రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందేది కదా?’’ అని రాయలసీమ నేతలు అంటున్నారు.

‘గతంలో మద్రాస్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు నెల్లూరు వాళ్లు రాయలసీమతోనే ఉన్నారు. కృష్ణదేవరాయల పాలన సమయంలోనే అలాగే ఉండేది. రాయలసీమతో పాటు పాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలనే గ్రేటర్‌ రాయలసీమ అంటున్నాం. రాజకీయ రాజధాని లేదా పరిపాలన రాజధాని పెట్టాలి. అంతేకాని మేం అడుగుతున్నది న్యాయ రాజధాని కాదు. రాజధానితో పాటు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయండి.. తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. మరి రాయలసీమకే చెందిన జగన్ ఈ వాదనతో ఏకీభవిస్తారా..? చూడాలి.. ఏం జరుగుతుందో..?