ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న మూడు రాజధానుల నిర్మాణం

ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న మూడు రాజధానుల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయమై సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్మాణం అనేది రాత్రి వ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తరలించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబందించిన యూనైటెడ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ సదరు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా వారు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చేయడానికి వారికీ ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈమేరకు ప్రకాశం బ్యారేజి వద్ద స్థానిక లాయర్లు రాష్ట్రంలోని రైతులు, రాజకీయ నేతలతో కలిసి ప్రారంభించనున్న ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చి చేప్పేశారు.

ఇకపోతే వీరు చేయనున్న ధర్నా వలన అక్కడి స్థానిక ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, దానికితోడు ప్రకాశం బ్యారేజి పురాతన కట్టడమని, అందువల్ల అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల వారికి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇకపోతే పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అపరాధ చర్యలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.