ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరుని నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, రైతులు అందరు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు., దానికి తోడు అమరావతిలోని రైతులు దీక్షలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ కి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు.

అంతేకాకుండా రానున్న రోజుల్లో ఏపీలోని 13 జిల్లాలని మార్చేసి, ఏపీని 25 జిల్లాలుగా విడగొట్టనున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే రైతుల ఆగ్రహానికి గురవుతున్నటువంటి సీఎం జగన్ ప్రభుత్వానికి మరొక రకంగా ఎంపీ విజయసాయి రెడ్డి రైతులను మరింతగా ఆగ్రహానికి గురి చేస్తున్నాడని మండిపడుతున్నారు.