50 లక్షలు డిమాండ్ చేస్తున్న నిందితుల తల్లిదండ్రులు

50 లక్షలు డిమాండ్ చేస్తున్న నిందితుల తల్లిదండ్రులు

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ హత్యకు కారణమైన ఆ నలుగురు మృగాలను చంపేయాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా వచ్చాయి. ఈమేరకు ఆ నిందితుల తల్లిదండ్రులు కూడా తమ కొడుకులకు అందరితో పాటె మరణ శిక్షను విదించాలని వాఖ్యానించారు. అయితే ఈ కేసును రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో, ఆ నిందితులు పోలీసులకు ఎదురు తిరగడంతో, ఆత్మ రక్షణ కోసమని ఆ నలుగురు మృగాలను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఆ నిందితుల తల్లిదండ్రులు పరిహారం అడుగుతున్నారు.

అయితే ఈ ఎన్ కౌంటర్ ఘటన పై దేశ వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. కానీ తమ కొడుకులను అన్యాయంగా కావాలనే చంపేశారని నిందితుల తల్లిదండ్రులు గొడవ పెడుతున్నారు. దానికి తోడు వారి కొడుకులని ఎన్ కౌంటర్ చేసినందుకు ఒక్కో మృతుడి కుటుంబానికి 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా న్యాయస్తానం నుండి ఎలాంటి విషయం వెల్లడవక ముందే, నిందితులను అనవసరంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆ నిందితుల కుటుంబసభ్యులు ఆరోపించారు.v