“యానిమల్” సీక్వెల్ టైటిల్ వచ్చేసింది ..!

“యానిమల్” సీక్వెల్ టైటిల్ వచ్చేసింది ..!
Cinema News

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా కి సంబందించిన సీక్వెల్ టైటిల్ నేడు రివీల్ అయ్యింది. సినిమా ఎండ్ కార్డ్ లో “యానిమల్ పార్క్” అంటూ సీక్వెల్ టైటిల్ ని అనౌన్స్ చేశారు.

“యానిమల్” సీక్వెల్ టైటిల్ వచ్చేసింది ..!
Animal Movie

సీక్వెల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఈ సినిమా కొనసాగింపు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ని T-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాల పై నిర్మించారు.