జగన్‌ మరో గుడ్ న్యూస్…660 మందికి ‘మహిళాశక్తి’ ఆటోలు

Another good news of Jagan... 'Mahila Shakti' autos for 660 people
Another good news of Jagan... 'Mahila Shakti' autos for 660 people

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో తీపికబురు చెప్పారు. పేద మహిళలకు ‘మహిళాశక్తి’ ఆటోలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఇందులో భాగంగానే… తొలి విడతలో పొదుపు సంఘాల సభ్యులైన 231 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు పంపిణీ చేయనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 660 మందికి పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి మిగిలిన లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఆటో కొనుగోలు ఖర్చులో 90శాతం వడ్డీ లేని రుణం ఇవ్వనున్నారు. 48 నెలలు సమాన కిస్తీల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించారు అధికారులు.

26 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో మహిళలకు ఆటోల అందజేస్తామని సెర్ప్ అధికారులు వెల్లడించారు. దీనిపై లబ్ధిదారులైన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు గ్రూప్ -2 నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 331 నాన్ ఎగ్జిక్యూటివ్ పో స్టులు – 566 విడుదల చేసింది జగన్‌ సర్కార్‌.