పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ?

పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ?
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఇప్పట్లో షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలా లేదు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ సినిమా లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ?
Pavan Kalyan, Director Krish

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీ ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది అన్నట్టు ఈ సినిమా పూర్తి చేసే గ్యాప్ లో క్రిష్ మరో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హీరో గోపిచంద్ తో ఈ సినిమా ఉంటుందట.