బాలీవుడ్‌లో నయన తార మరో మూవీ?

బాలీవుడ్‌లో నయన తార మరో మూవీ?
Latest News

స్టార్‌ హీరోయిన్‌ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, లేదు. తమిల్‌, తెలుగు రెండింటా మంచి క్రేజ్‌ తెచ్చుకుంది నయన తార. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార హీరోయిన్ గానే కాకుండా పలు ఎన్నో వివాదాలు, ఎఫైర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ప్రభుదేవా, శింబు వంటి వారితో ప్రేమాయణం నడిపి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్‌లో నయన తార మరో మూవీ?
Nayantara

నయనతార ఒక పెళ్లయిన రాజకీయ నాయకుడితో సహజీవనం చేసింది అంటూ గతంలో ఎక్కువగా వార్తలు వచ్చాయి .. అసలు విషయంలోకి వెళితే తమిళ ముఖ్యమంత్రి DMK స్టాలిన్ కుమారుడు ఉదయనిధితో ఈమె రిలేషన్ లో ఉందంటూ అప్పట్లో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ఇదంతా పక్కకు పెడితే.. లేడీ సూపర్ స్టార్ గా పేరు ఉన్న నయనతార ఇటీవల జవాన్ తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆమె బిటౌన్ లో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా…. సంజయ్ లీల బన్సాలి తెరకెక్కిస్తున్న ‘బైజూ బావ్రా’లో నయన్ నీ ఒక కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆలియాభట్ హీరోయిన్ గా సందడి చేయనుంది.