వన్ మ్యాన్ షో..కేసీఆర్‌ వస్తే వార్ వన్ సైడే..!

One man show..if KCR comes, war is one side..!
One man show..if KCR comes, war is one side..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైపోయింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఇంకా ఎన్నికలకు కరెక్ట్ గా 50 రోజుల సమయం ఉంది. బి‌ఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించింది..అటు కాంగ్రెస్ అభ్యర్ధులని ప్రకటించే పనిలో ఉంది. కానీ మేనిఫెస్టో ముందే ప్రకటించింది. ఇక బి‌జే‌పి రెండిటిల్లో వెనుకబడింది..ఆ పార్టీ కూడా పూర్తిగా రేసులో వెనుక ఉంది. అయితే ఇప్పటివరకు చూసుకుంటే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడతాయని సర్వేలు చెబుతున్నాయి. బి‌జే‌పి కొన్ని చోట్ల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే బి‌ఆర్‌ఎస్ లో హరీష్ రావు, కే‌టి‌ఆర్ మాత్రమే పార్టీ తరుపున ప్రచారం, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రచారంలో దిగలేదు. అభ్యర్ధుల ఎంపికపైనే దృష్టి పెట్టింది. ఏది ఎలా చూసుకున్న బి‌ఆర్‌ఎస్ ప్రచారంలో ముందు ఉంది. కాకపోతే బి‌ఆర్‌ఎస్‌కు అంత అనుకూలమైన పరిస్తితులు కనిపించడం లేదు. కాంగ్రెస్ లో బలమైన నేతలు వెళ్ళడంతో ఆ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో కే‌సి‌ఆర్ బాధపడుతున్నారు.

ఇక కే‌సి‌ఆర్ ఈ నెల 15 తేదీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. రోజుకు 2,3 సభలు నిర్వహిస్తూ వంద నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయనున్నారు. ఆయన ఇమేజ్ తోనే హ్యాట్రిక్ కూడా సాధిస్తారని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.కే‌సి‌ఆర్ మాటల మాంత్రికుడు అనే సంగతి తెలిసిందే. ఆయన ప్రచార శైలి జనాలని పూర్తిగా ఆకట్టుకుంటుంది. చూడాలి మరి ఈ సారి కే‌సి‌ఆర్..హ్యాట్రిక్ విజయం అందిస్తారో లేదో.