వెంకయ్య వ్యతిరేకులు హ్యాపీ.

Bjp pick to Venkaiah naidu as Vice president candidate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అనగానే బీజేపీ లో హర్షం వ్యక్తం చేసిన వాళ్ళు ఎందరు వున్నారో, ఆయన పార్టీకి దూరం అవుతున్నారని బాధ పడ్డ వాళ్ళు అందరున్నారు. ఇక వెంకయ్య సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడా అదే పరిస్థితి. ఇక్కడ వెంకయ్యని నమ్ముకుని బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించే వాళ్లంతా కంగారు పడుతుంటే, ఇక టీడీపీ తో పార్టీ మైత్రిని ఒప్పుకోలేని వాళ్లంతా సంబరపడుతున్నారు. కేవలం వెంకయ్య వల్లే టీడీపీ తో బీజేపీ స్నేహం కొనసాగుతుందని, అందువల్లే ఇక్కడ పార్టీ ఎదగలేకపోతోందని భావించే వాళ్లంతా ఇప్పుడు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబు వ్యతిరేకులు బీజేపీ ని టీడీపీ నుంచి దూరం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా ఈ ప్రయత్నాల్ని వెంకయ్య ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వున్నారు. బీజేపీ, టీడీపీ జోడీని నిలబెడుతూ వచ్చారు. ఇప్పుడు వెంకయ్య ఉప రాష్ట్రపతిగా క్రియాశీల రాజకీయాలకి దూరమైతే అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని బీజేపీ లో ని ఓ వర్గం భావిస్తోంది.

సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, కావూరి లాంటి వాళ్ళు టీడీపీ తో కాకుండా బీజేపీ సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వీరి వద్ద కొన్ని వ్యూహాలు కూడా వున్నాయి. అయితే అధిష్టానాన్ని వెంకయ్య ప్రభావితం చేసినంత కాలం వీరి మాట చెల్లుబాటు కాలేదు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలని భావిస్తున్న మోడీ, అమిత్ షా ద్వయం తమకు అండగా నిలుస్తారని వీరు భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీ లోనే కాక మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో దిగ్గజ నాయకుడిగా వున్న వెంకయ్య రాజకీయ వ్యూహాలకు కాలం చెల్లినట్టే. అయితే ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి పోరాటం చేసే వెంకయ్యని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఏమైనా ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ లో కొత్త మలుపులు తప్పేట్టు లేవు.

మరిన్ని వార్తలు 

మోడీ కోసం ముందే కూస్తున్న నితీష్

మోడీ, కేసీఆర్ ఫెవికాల్ బంధం

జగన్ మాటలకు, చేతలకు పొంతన ఎక్కడ?