మీది సంసారం.. ఇతరులది వ్యభిచారమా

jc in airplane issues at high court

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హైకోర్టు ఇచ్చిన ఝలక్ కు జేసీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. విమానయాన సంస్థలు తనపై అన్యాయంగా నిషేధం విధించాయన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు మీరు చేసింది తప్పే కాదా, ఇదే విధంగా ఓ ప్రయాణికుడు మీ దివాకర్ ట్రావెల్స్ లో చేస్తే అనుమతిస్తారా అని కోర్టు ప్రశ్నించే సరికి జేసీ అవాక్కయ్యారు.

తనపై న్యాయసూత్రాలకు విరుద్ధంగా నిషేధం విధించారన్న జేసీ వాదనకు కోర్టు విలువ ఇవ్వలేదు. విమానయాన సంస్థల వివరణ వినకుండా మీకు మినహాయింపు ఇవ్వలేమని, పార్లమెంట్ కోసం కూడా సడలింపు కుదరదని స్పష్టం చేసింది కోర్టు. దీంతో ఖిన్నుడైన జేసీ.. తన స్నేహితుడు అరేంజ్ చేసిన ప్రత్యేక విమానంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.

దివాకర్ ట్రావెల్స్ పేరుతో ఇప్పటికే ప్రత్యర్థులు జేసీని చెడుగుడు ఆడుతున్నారు. ఇప్పుడు కోర్టు కూడా అదే వాదన ఎత్తుకోవడం జేసీకి మింగుడుపడటం లేదు. ఎక్కువసేపు దివాకర్ ట్రావెల్స్ పై వాదన జరిగితే.. అసలు కేసు పక్కకెళ్లి.. కొత్త తంటా వచ్చి పడుతుందని జేసీ భయపెడుతున్నారు. ఈ విషయంలో తాను చేసేదేం లేదని బాబు కూడా తేల్చారు కాబట్టి.. జేసీ సైలంట్ గా ఉంటే అందరికీ మంచిది.