నాని అప్పుడే డేట్‌ ఫిక్స్‌ చేశాడు

Nani MCA movie release date fix

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం ‘నేను లోకల్‌’, ‘నిన్నుకోరి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నాని మరో సినిమాను ఇదే సంవత్సరంలో తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా ఏడు విజయాలను అందుకున్న నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో మొదటిది దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఎంసీఎ’. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 30 శాతం షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 

‘నిన్నుకోరి’ చిత్రం సక్సెస్‌ అయిన నేపథ్యంలో దిల్‌రాజు మరింత స్పీడ్‌గా ‘ఎంసీఏ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే వచ్చే సంవత్సరంలో ‘ఎంసీఎ’ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే ముందే తీసుకు వచ్చి ఈ సంవత్సరంలో నానికి మూడు సక్సెస్‌లు దక్కాయి అనే రికార్డును సొంతం చేసేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో, ఆకట్టుకునే యూత్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం పూర్తి కాకుండానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జున యుద్దం’ అనే చిత్రాన్ని చేసేందుకు నాని కమిట్‌ అయ్యాడు. ‘ఎంసీఏ’ చిత్రం డిసెంబర్‌ 28న విడుదల కానుండగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ లేదా మేలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు 

పూరి నోరు విప్పితే టాలీవుడ్‌ షేక్‌..!

కన్ఫర్మ్‌.. పవన్‌ తర్వాత బన్నీకి ఇచ్చింది

 హీరోయిన్‌ విషయంలో పొరపాటు చేసిన గోపీచంద్‌