బిగ్‌బాస్‌ : సంపూ ది లీడర్‌

NTR appoints sampoornesh babu as Big Boss Show Leader

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన స్టార్‌ మాటీవీ బిగ్‌బాస్‌ షో అప్పుడే ఆసక్తికర అంశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహంను, ఆసక్తికి కలిగిస్తుంది. మొదటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ సెలబ్రెటీలను పరిచయం చేసి హౌస్‌లోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత రోజు నుండి అంటే నిన్నటి నుండి వారి జర్నీ స్టార్ట్‌ అయ్యింది. నిన్న సెలబ్రెటీలందరితో మాట్లాడి బిగ్‌బాస్‌ వారికి సంపూర్నేష్‌బాబును మొదటి లీడర్‌గా నియమించడం జరిగింది. ఈ షోలో ఉండేందుకు ఎవరికి తక్కువ అర్హత ఉంది అంటూ పార్టిసిపెంట్లను ప్రశ్నించగా ఎక్కువ మంది సంపూ అంటూ చెప్పడంతో అందరికి షాక్‌ ఇస్తూ సంపూను హౌస్‌ లీడర్‌గా బిగ్‌బాస్‌ నియమించడం జరిగింది. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో పార్టిసిపెంట్స్‌ ఎలా మెలగాలి, వారు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను లీడర్‌ నియంత్రిస్తూ ఉంటాడు. హౌస్‌మెంట్స్‌ రూల్స్‌ను అతిక్రమించకుండా వారు సక్రమంగా హౌస్‌లో ఉండేలా లీడర్‌ అంటే సంపూ చూసుకోవాల్సి ఉంటుంది. సంపూర్నేష్‌బాబుకు ప్రత్యేకమైన వసతులను బిగ్‌బాస్‌ కల్పించాడు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే లీడర్‌ అయిన సంపూర్నేష్‌బాబు ఎలాంటి పనులు చేయకుండా ఊరికే కూర్చునే అవకాశం ఉంది. ఇక లీడర్‌ అయిన సంపూర్నేష్‌బాబు మొదటి వారంలో ఎలిమినేషన్‌ జాబితా నుండి తప్పించడం జరిగింది. మొదటి రోజే పలు ఆసక్తికర విషయాలు షోలో జరిగాయి. ముందు ముందు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మస్త్‌ ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు 

నాని అప్పుడే డేట్‌ ఫిక్స్‌ చేశాడు

వీళ్లే బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్స్‌

మొదటి ఎపిసోడ్‌లోనే షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌