ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ…వారికే …!

AP Chief Minister Chandrababu Has Filled Up the Nominated Posts in AP

ఏపీలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న నామినేటేడ్ పోస్టులని భర్తీ చేసి తెలుగు తమ్ముళ్ళకి ఆనందాన్ని నింపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికలు దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పదవుల్ని భర్తీ చేసి సీఎం ఆదివారం ఆమోద ముద్ర వేశారు.
వివరాల్లోకి వస్తే..

Chandrababu Has Filled Up the Nominated Posts

  • కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డికి ఏపీ విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌  పదవిని అప్పగించారు.
  • పార్టీలో మరో ముఖ్య నేత బూరగడ్డ వేదవ్యాస్‌ను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఇక ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కృష్ణాజిల్లాకు చెందిన బొడ్డు వేణుగోపాల్..
  • ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమబోర్డు ఛైర్మన్‌గా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దమ్మేటి సుధాకర్‌ను..
  • అలాగే నూర్‌బాషా-దూదేకుల ముస్లిం కార్పొరేషన్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన బబన్‌ను నియమించారు.
  • ఇక అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా విశాఖ జిల్లాకు చెందిన కాకి గోవిందరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.