పార్లమెంటు మెట్లకు మొక్కిన సీఎం చంద్రబాబు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం అంటూ ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు లోకి ఎంటర్ అవగానే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహానికి టీడీపీ ఎంపీలతో కలిసి పుష్పాంజలి ఘటింఛి అటు నుండి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు వచ్చి అక్కడ ఉన్న మెట్లకు నమస్కరించారు. చంద్రబాబు నమస్కరిస్తున్న సమయంలో టీడీపీ ఎంపీలు ‘జై తెలుగుదేశం’, ‘జై జన్మభూమి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

పార్లమెంటు లోపలికి వచ్చిన చంద్రబాబు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. అటు నుండి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో పలువురు నేతలను సీఎం కలుసుకున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ ను చంద్రబాబు కలుసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా అన్నాడీఎంకే ఫ్లోర్‌లీడర్ వేణుగోపాల్‌తో మాట్లాడారు. మనమంతా దక్షిణ భారతీయులమని… ఏపీకి జరిగిన అన్యాయం గుర్తించి తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మీ పార్టీ మద్దతు ఇచ్చేలా చూడాలని కోరారు. అయితే వేణుగోపాల్ మాత్రం తమ పార్టీ అధినేతతో భేటీ అయి తుది నిర్ణయం తీసుకుంటామని…పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం మాత్రమే తమ నిర్ణయాన్ని తెలుపుతామని చంద్రబాబుకు తెలియజేశారు.

అవిశ్వాసంపై మద్దుతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ ఫ్లోర్ లీడర్ల‌ను చంద్రబాబు కలుసుకుని ధన్యవాదాలు తెలుపున్నారు.  అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కోరనున్నారని పార్టీ వర్గాల సమచారం. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు.