బాబు మరో అస్త్రం…రైతులకి నగదు బదిలీ…!

AP Cm Chandrababu Transfer Of Cash To Farmers

తెలంగాణాలో అమలు చేస్తున్న రైతులకు నేరుగా నగదు పంపిణీ చేసే పెట్టుబడి సాయం పధకం అయిన రైతు బంధు పధకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా అమలు చేయడానికి చంద్రబాబు విధివిధానాలు రూపొందించారు. సాగు చేసే రైతులందరికీ సాయం అందేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఈ నెల ఇరవై ఒకటో తేదీన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని వెంటనే ఒక విడత డబ్బులు పంపిణీ చేసేస్తారని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రకటన వస్తే మళ్ళీ కోడ్ రాక ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద నుంచి రుణాలను సమీకరించి రుణమాఫీకి పెండింగ్‌లో ఉన్న రెండు విడతల సొమ్మును చెల్లించడానికి ఏర్పాట్లు చేసింది. వాటితో పాటు కొత్తగా పెట్టుబడి సాయం ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం చూసుకోవడం కంటే వారికి నేరుగా డబ్బులు పంచడం బెటర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఇలా చేయడం వల్ల లబ్దిదారులు నేరుగా ప్రభుత్వానికే ఓటేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగతా ఎన్నికల హామీల కన్నా వివిధ వర్గాలకు ఎక్కువగా నేరుగా.. లాభం చేకూర్చే పథకాలకు… రూపకల్పన చేశారు. పెట్టుబడి సాయం, గొర్రెల పంపిణి ఈ కోవలోకే వస్తాయి. తెలంగాణలో కేసీఆర్ విజయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పలు రాష్ట్రాలు రైతు బంధు తరహా పథకాలు ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ఏపీ పథకంలోని లోపాలను సవరించి కౌలు రైతులకు కూడా ఈ డబ్బు ఇవ్వాలని అనుకుంటున్నారు. నిజానికి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే తమ వ్యతిరేకత పోగొట్టుకుని ఓట్లు వేయించుకోవాలని రైతుల కోసం ఏదో చేయాలని ఆలోచిస్తోంది. కానీ ఏం చేయాలన్న దాని మీద కేంద్రానికి క్లారిటీ లేదు. దీనిపై కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రకటించేస్తున్నాయి. ఒక వేళ కేంద్రం పథకం ప్రకటిస్తే అమలు చేయాల్సింది రాష్ట్రాలే కాబట్టి రాష్ట్రాలు ఆర్ధిక భారం తప్పించుకునే అవకాశం ఉంది