పరకాలకి చంద్రబాబు పోగపెట్టారా ?

AP CM Disowned The Parakala Prabhakar As A Media Adviser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ – టీడీపీ మధ్య విభేదాలు కాస్తా ఇంతకాలం చంద్రబాబు టీంలో పనిచేసుస్తున్న ఓ వ్యక్తి పదవికి ఎసరు తెచ్చాయట. అది ఎవరో కాదు కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ భర్త ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారుడిగా పరకాల ప్రభాకార్. బీజేపీ – టీడీపీల బంధం తెగిపోయాక సీఎం చంద్రబాబు మీడియా సలహాదారుడిగా పరకాల ప్రభాకర్ ను అప్రకటితంగా పక్కనపెట్టేశారట. దానికి కారణం మోదీ కేబినెట్లో మహిళా మంత్రిగారికి భర్త కావడమేనని ప్రచారం సాగుతోంది. ఒక‌ప్పుడు బీజేపీ నేత‌గా ఉన్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌కు ఆ పార్టీ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నాలుగేళ్ల‌లో చంద్రబాబు వెంట ప‌ర‌కాల విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఈ టూర్ల గురించి ప‌ర‌కాల‌కు తెలుసు. ప‌ర‌కాల ఎప్ప‌టికైనా డేంజర్ ఏ కాబట్టి ఇప్పటికయినా ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టార‌ని అమ‌రావ‌తిలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

2014లో చంద్రబాబు సీఎం అయింది మొదలు.. ఆయన చేసిన ప్రతి విదేశీ పర్యనలలో పరకాల దాదాపుగా ఉన్నారు. కానీ ఎప్పుడయితే బీజేపీ – టీడీపీల బంధం తెగిపోయిందో అప్పుడే ఆయన్ని పక్కన పెట్టాలని అనుకున్నట్టు తెలుస్తోంది. మొన్నఈ మధ్య జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గ్రూప్ కంపెనీలకు చెందిన సంజయ్ ఆరోరాను కమ్యూనికేషన్ల సలహాదారుగా ప్రకటించారట దీంతో అక్కడే ఉన్న పరకాల ఈ నిర్ణయం వినగానే వెంటనే అక్కడి నిష్క్రమించారని. అప్పటి నుంచి మళ్లీ అమరావతి ఛాయల్లో పరకాల కనిపించలేదని టాక్. ఇటు పార్టీకి, ప్ర‌భుత్వానికి స‌మ‌య‌న్వ‌య క‌ర్త‌గా…. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణ‌య్య వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో త‌న ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని గ‌మ‌నించిన ప‌రకాల అమరావతి కి దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది.