పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు…

పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు...

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. క్రీడలను ప్రోత్సహించేందుకు పీవీ సింధు అకాడమీకి విశాఖలో భూములు కేటాయిస్తామని టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. త్వరలో 4 క్రీడా వికాస కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

అయితే పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గత ఏడాది కూడా 3 కోట్లు పేద క్రీడాకారులుకు అందించామని అన్నారు. త్వరలోనే జిమ్ లను కూడా రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో టూరిజం హోటళ్లను కూడా తెరుస్తున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి అన్ని పర్యాటక ప్రాంతదేశాలను మళ్ళీ అందుబాటులోకి తెస్తామని అవంతి అన్నారు.