తూ.గోలో బయటపడ్డ కొత్త ఊరు

New Village In The East Godavari District

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అసలు ప్రపంంచ కొత్త గ్రహాల్ని కనిపెట్టే దిశగా ముందుకు దూసుకెళ్తోంది. కానీ ఇప్పటికే మన భూమిపైనా మనకు తెలియనివి చాలా ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. నిజమే అప్పుడెప్పుడో పాత కాలంలో కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు. వాస్కోడాగామా ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టాడు. అదంతా చరిత్ర. అలాంటి చరిత్రే ఇప్పుడు తూగోలో ఆవిష్కృతమైంది.

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో మన్యంలో ఓ కొత్త గ్రామాన్ని కనుగొన్నారు. విషజ్వరాల పుణ్యమా అని రెవిన్యూ రికార్డుల్లో లేని ఊరు వెలుగులోకి వచ్చింది. దీంతో డిజిటల్ యుగంలో కూడా కొత్త గ్రామాలు వెలుగులోకి వస్తాయని తేలింది, ఇంకా చాలా గ్రామాలు చీకట్లో ఉన్నాయని స్పష్టమైపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొత్తపాలెం అనే ఊరి గురించి అధికారులు ఎవరికీ తెలీదు. విషజ్వారాలు వచ్చాయని ఓ గిరిజనుడు దగ్గర్లోని టౌనుకొచ్చి చెప్పడంతో వెళ్లిన డాక్టర్లు ఆ ఊరు చూసి ఆశ్చర్యపోయారు.

ఎప్పుడూ చూడని దారి, ఎప్పుడూ వెళ్లని ఊరు. అధికారులకు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. తాము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగాం కానీ.. అనంతగిరి నుంచి లోతట్టు ప్రాంతానికి వెళితే కానీ ఆ ఊరు చేరుకోలేకపోయారు. మొత్తం 35 మంది పెద్దలు, పదిహేను మంది పిల్లలు అక్కడ ఉన్నారు. మొక్కజొన్న, గంటెలు వంటి పంటలు అక్కడి భూముల్లో పండించి తింటున్నారు. ఇంకా ఇలాంటి గ్రామాలు ఉంటే వెలికితీయాలని సర్కారు ఆదేశించడంతో ఆ పనిలో పడ్డారు అధికారులు.

మరిన్ని వార్తలు:

డిసెంబర్లో మళ్లీ దబిడి దిబిడి