AP Politics: విజయవాడలో అంగన్ వాడీలను అరెస్ట్ చేసిన పోలీసులు

AP Politics: Police arrested Angan wadis in Vijayawada
AP Politics: Police arrested Angan wadis in Vijayawada

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి అంగన్ వాడీలు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంగన్ వాడీలకు వేతనాలు పెంచాలని, వసతులు కల్పించాలని, రకరకాల డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. కష్టపడే వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు అంగన్ వాడీలు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఇవాళ దీక్ష చేస్తున్న అంగన్ వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీ.హెచ్.బాబురావు ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.విజయవాడలో వందలాది మంది అంగన్వాడీలను దౌర్జన్యంగా అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు. ధర్నా శిబిరాన్ని పీకి వేశారు పోలీసులు. అంగన్ వాడీల రక్తం కళ్ళ జూసింది ప్రభుత్వం. పలువురికి గాయాలు అయ్యాయి. శాసనసభ్యులకు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. బస్సులు, వాహనాల్లో అజిత్ సింగ్ నగర్ షాదిఖానాకు అంగన్వాడీల తరలించారు. షాది ఖానాలో కూడా ఆందోళన నిర్వహిస్తున్నారని.. 16 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు సీ.హెచ్.బాబు రావు.