AP Politics: అంగన్వాడీల ధర్నా శిబిరాన్ని పీకేసిన పోలీసులు..!

AP Politics: Police raided the Anganwadi dharna camp..!
AP Politics: Police raided the Anganwadi dharna camp..!

విజయవాడలో వందలాది మంది అంగన్వాడీలను దౌర్జన్యంగా అరెస్టు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. అంగన్వాడీల ధర్నా శిబిరాన్ని పీకి వేసిన పోలీసులు….అంగన్వాడీల రక్తం కళ్ళ జూసారు. అయితే… ఈ సందర్బంగా పోలీసులు చేసిన దాడిలో పలువురు అంగన్వాడీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ లోని శాసనసభ్యులకు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లకుండా అంగన్వాడీలను అడ్డుకున్నారు పోలీసులు. బస్సులు, వాహనాల్లో అజిత్ సింగ్ నగర్ లోని షాదిఖానాకు అంగన్వాడీలను తరలించారు పోలీసులు. అయినప్పటికీ…. షాది ఖానాలో ఆందోళన కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.

అయితే అంగన్వాడీలను అరెస్ట్ చేయటాన్ని సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు ఖండించారు. 16 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు. కాగా గత 16 రోజులుగా శాంతియుతంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ జగన్ సర్కార్ దిగిరావడం లేదు.