అరవింద సమేత 2వ టీజర్‌.. కారణం ఇదే!!

aravinda sametha movie 2nd teaser

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం టీజర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌లోని ఎమోషన్‌ను, యాక్షన్‌ సీన్స్‌ రూపంలో దర్శకుడు త్రివిక్రమ్‌ చూపించాడు. టీజర్‌కు అనూహ్యమైన స్పందన దక్కింది. సోషల్‌ మీడియాలో దాదాపుగా పది మిలియన్‌ల వ్యూస్‌ను ఈ టీజర్‌ దక్కించుకుంది. ఇంతటి రికార్డు స్థాయి వ్యూస్‌ను దక్కించుకున్న అరవింద సమేత నుండి మరో టీజర్‌ను వదలబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న టీజర్‌ త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ను కాస్త నిరాశ పర్చింది. త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే అరవింద సమేత నుండి రెండవ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Aravinda Sametha Veera Raghava

త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించే విధంగా ‘అరవింద సమేత’ రెండవ టీజర్‌ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈనెల చివర్లోనే రెండవ టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచేందుకు రెండు టీజర్లను విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెల 15 తర్వాత ఆడియో విడుదల వేడుక కార్యక్రమం నిర్వహించి, ఆ వేడుకలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడంటూ సమాచారం అందుతుంది. రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమా స్థాయిని పెంచడం ఖాయం. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎన్టీఆర్‌ గత చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేస్తుందనే నమ్మకంను నందమూరి ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

ntr