‘అరవింద’లో ఇంకోటి ప్లాన్‌ చేశారటా కానీ…?

Aravinda Sametha 5 Days Box Office Collections Report

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్ర వసూళ్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. కేవం మొదటి రోజే 60కోట్ల గ్రాస్‌ను చేరుకుందని టాక్‌ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల క్రేజీ కాంభోకు ప్రేక్షకులు భారీగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ కెరియర్‌లో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఇలా ఎన్ని రోజుల పాటు వర్కౌట్‌ అవుతుందనేది చెప్పలేం. తాజాగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు.

trivikram

‘అరవింద సమేత’ సక్సెస్‌ మీట్‌లో పాల్గోన్న త్రివిక్రమ్‌ ఆసక్తికర అంశాలను బయట పెట్టాడు. ఈ చిత్ర క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని ప్లాన్‌ చేశారట. కానీ ఫైట్‌ మాస్టర్‌లు రామ్‌ క్ష్మణ్‌లు యాక్షన్‌ ఎపిసోడ్‌ కాకుండా కేవలం ఎమోషనల్‌ సీన్‌ అయితేనే బాగుంటదని సలహా ఇచ్చారట. దాంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నారట. అందుకు ఫైట్‌ మాస్టర్‌లకు త్రివిక్రమ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. వారు పెట్‌ మాస్టర్‌లు కాదు, దర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు, కొన్ని సీన్లను వారి సలహా మేరకే చేశాం, చివరికి చాలా బాగా వచ్చింది అంటూ త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ స్టామినా వల్ల భారీ యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. అయితే మొత్తం యాక్షన్‌ ఉంటే క్లాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకోలేదని క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని రద్దు చేశారట!

aravindha-sametha-movie-release