అరవింద సమేత వీరరాఘవ టీజర్….అదిరిపోయింది…నో వర్డ్స్

 

Aravinda Sametha Veera Raghava official Teaser

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘అరవింద సమేత’ టీజర్‌ వచ్చేసింది. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ టీజర్‌ను త్రివిక్రమ్‌ నందమూరి అభిమానులకు కానుకగా ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌ కోసం కొన్ని సంవత్సరాలుగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురు చూపులకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఉండబోతుందని దర్శకుడు త్రివిక్రమ్‌ టీజర్‌తోనే తేల్చి చెప్పాడు. మాస్‌ ఆడియన్స్‌కు దేవుడు అయిన ఎన్టీఆర్‌ను ఎలా వారు చూడాలనుకుంటున్నారో ఈ చిత్రంలో దర్శకుడు అలా చూపించబోతున్నాడు. తన గత చిత్రం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంపై ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని, అన్ని విషయాల్లో పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా త్రివిక్రమ్‌ టీజర్‌తో చెప్పేశాడు.

Aravinda Sametha Veera Raghava

ఎన్టీఆర్‌ను చాలా పవర్‌ ఫుల్‌గా, మాస్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అవ్వగలడని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. తప్పకుండా ఇదో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా, దసరా విజేతగా నిలుస్తుందని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘అరవింద సమేత’ టీజర్‌లో ఉన్న డైలాగ్స్‌ అప్పుడే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చలపులి మొహంపై గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని జగపతిబాబు చెప్పే డైలాగ్‌తో పాటు ఎన్టీఆర్‌ చెప్పిన కంటపడ్డవా కనికరిస్తానేమో… ఎంట పడ్డానా నరికేస్తా.. డైలాగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్‌ లుక్‌ మరియు స్టైల్‌ కూడా చాలా బాగుంది. జైలవకుశ చిత్రానికి ఈ చిత్రంకు చాలా వైవిధ్యంను ఎన్టీఆర్‌ చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్‌ రెండవ వారంలో సినిమా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ చిత్రంగా ఇది నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.