త్రివిక్రమ్‌ ప్రయత్నాలు అన్ని వృదా!

Aravindha Sametha NTR Full Getup Pic Leaked

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా ‘అరవింద సమేత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక తెలుగమ్మాయి ఈషారెబ్బా ఈ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించబోతుంది. రాయలసీమ అమ్మాయిగా ఈషా కనిపిస్తుందని ఇప్పటికే మ్యాటర్‌ లీక్‌ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు లీక్‌ అవ్వడంతో పాటు ఈమద్య వరుసగా ఫొటోలు సెట్స్‌ నుండి లీక్‌ అవుతున్నాయి. ఈమద్య ఎన్టీఆర్‌ మరియు నాగబాబు కలిసి ఉన్న ఒక స్టిల్‌ లీక్‌ అయ్యింది. చాలా కీలకమైన ఆ స్టిల్‌ లీక్‌ అవ్వడంతో దర్శకుడు త్రివిక్రమ్‌ చాలా సీరియస్‌ అయ్యాడు. స్టిల్‌ లీక్‌ అవ్వడంతో ఇకపై సెట్స్‌లో ఎవరు ఫోన్‌ు వాడవద్దని, ఇతరులను చిత్రీకరణ స్పాట్‌కు రానివ్వొద్దు అంటూ ప్రొడక్షన్‌ టీంకు సూచించాడు.

త్రివిక్రమ్‌ వార్నింగ్‌ ఇచ్చి వారం రోజులు అయ్యిందో కాలేదో అప్పుడు ఎన్టీఆర్‌ మరో స్టిల్‌ సెట్స్‌ నుండి లీక్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించబోతున్నాడు అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. రెండు విభిన్న గెటప్స్‌లో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. ఇప్పటికే మొదటి గెటప్‌కు సంబంధించి అధికారిక ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. అయితే తాజాగా రెండవ గెటప్‌ లీక్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ ఫ్యాక్షనిస్ట్‌గా వైట్‌ అండ్‌ వైట్‌లో కనిపించి అందరిని అలరిస్తున్నాడు. షూటింగ్‌ జరుగుతున్న స్పాట్‌కు వెళ్లిన ప్రేక్షకుల్లో ఎవరో ఈ ఫొటోను తీసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌కు ఔటర్స్‌ను రానివ్వనప్పటికి ఎలా ఇది లీక్‌ అయ్యిందో తెలియడం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ లీక్‌పై కూడా త్రివిక్రమ్‌ చాలా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అప్పటి వరకు ఇంకా ఎన్ని లీక్‌లు చూస్తామో.