మానసికంగా అలిసిపోయారా?

మానసికంగా అలిసిపోయారా?

మానసికంగా అలిసిపోయిన వారు ఓపికగా ఉండరు. ఏ పనికి ఉత్సాహం చూపించరు, అసలు పొద్దున నిద్రలేచిన తరువాత మంచం దిగడానికి కూడా ఓపిక లేనంతగా అలిసిపోతారు. శారీరకంగా కూడా అలసట ఉంటుంది అంటున్నారు నిపుణులు.మానసికమైన ఒత్తిడి ఏదైనా కూడా శారీరకమైన అసౌకర్యానికి గురిచేస్తుంది. ఈ పరిస్థితినే మానసికమైన అలసట అంటారు. ఇలా ఉన్నప్పుడు చాలా ఎక్కువ పని చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంటుంది.

ఇలాంటి పరిస్థితి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా కాలంగా ఉన్న ఒత్తిడి, లవ్ లైఫ్‌లో కొన్ని తేలని విషయాలు, ఎక్కువ గంటలు పని చేయడం, ఆర్ధిక పరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి.ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈ మానసికమైన అలసటకి దారితీస్తాయి. దురదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, విడాకులు తీసుకోవడం వంటి సంఘటనలు సంభవించినా కూడా ఈ అలసట రావచ్చు.ప్రతి వ్యక్తి ప్రత్యేకమే, కాబట్టి ఈ అలసట ప్రతి వ్యక్తిలోనూ ఒకే రకంగా కనిపించదు.

ఆకలి ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం, అనవసరమైన కోపం, ఎప్పుడు చిరాగ్గా ఉండడం వంటివి ఈ అలసటకి లోనవుతున్నారనడానికి కొన్ని లక్షణాలుగా చెప్పవచ్చు.చిన్న చిన్న జీవన శైలి మార్పులు చేసుకోవాలి.సరిపడినంత నిద్రపోవడం వల్ల మనసు, శరీరానికీ కూడా విశ్రాంతి లభిస్తుంది.మ్యూజిక్ వినడం, వంట చేయడం, సంగీతం వినడం, తోట పని చేయడం వంటివి కొంత రిలాక్సేషన్‌ని ఇస్తాయి.మీ గురించి లోతుగా ఆలోచించడం కూడా హెల్ప్ చేస్తుంది అంటున్నారు నిపుణులు.

మీ ఆలోచనలని పేపర్ మీద పెట్టండి. అలా కాసేపు నడిచి రండి. ఏదైనా వెకేషన్‌కి వెళ్ళడం కుదురుతుందేమో చూడండి, కనీసం, ఫ్రెండ్స్‌ని కలిసి మాట్లాడండి. కొత్త పుస్తకాలు చదవండి.పెయింటింగ్ వేయడం నేర్చుకోండి. ఏదైనా అల్లడం వంటివి హెల్ప్ చేస్తాయి.మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం వల్ల మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటి వాటి ద్వారా మైండ్‌ ఫుల్‌నెస్‌ని సాధించవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మీ బ్రెయిన్‌ని మీరు కంట్రోల్ చేస్తారు, మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్ చేయదు. మీరెలా ఫీల్ అవుతారన్నది మీ ఇష్టం.మీరు ఎప్పుడు ఒత్తిడికి గురవుతారో తెలుసుకుని వాటిని మ్యానేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనందం, ప్రశాంతత అనేవి మనసుకి సంబంధించినవి.అలాగే, అప్పుడప్పుడూ అలసటకి గురవ్వడం కూడా సహజమైన విషయమే. ప్రతి రోజూ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకూ, మీ శరీరానికి, మనసుకి బ్రేక్ కావాలని గుర్తుపెట్టుకోండి.