చీచీ… నాపై దాడి జరగడం ఏంటీ

Arjun Kapoor says Drunk man does not attack me

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌పై దాడి జరిగిందని, షూటింగ్‌ స్పాట్‌కు ఒక అభిమాని వచ్చి హీరో అర్జున్‌ కపూర్‌పై దాడికి పాల్పడ్డాడు అంటూ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. సెట్స్‌లో ఒక అభిమానికి హలో ఇచ్చేందుకు అర్జున్‌ కపూర్‌ నిరాకరించాడని, దాంతో ఆ అభిమాని ఆగ్రహించి తనక షేక్‌ హ్యాండ్‌ ఇవ్వని కారణంగా దాడి చేశాడని, అర్జున్‌కు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని భాషల మీడియాల్లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు జోరుగా వస్తున్నాయి. అర్జున్‌ కపూర్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు అంటూ కూడా ప్రచారం జరగడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. తాజాగా తనపై దాడి, కేసు వార్తలపై అర్జున్‌ కపూర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు.

మీడియాలో తనపై దాడి జరిగినట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. అసలు తనపై ఎలాంటి దాడి జరగలేదని, తనను ఎవరు కూడా కొట్టలేదని, సెట్స్‌లో జరిగినది చిన్న విషయం అంటూ చెప్పుకొచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారని, మీడియా అత్యుత్సాహంతో, పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అర్జున్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు. తన గురించి ఒక వెబ్‌ సైట్‌లో వచ్చిన కథనం లింక్‌ను కూడా పోస్ట్‌ చేసి పచ్చి అబద్దం అంటూ తేల్చి పారేశాడు. నేషనల్‌ మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదు అంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు. అక్కడ గొడవ జరగనిదే వార్త కాదు. చిన్న గొడవ అంటున్నాడు. అంటే గొడవ జరిగిందనే విషయం నిజమే. అంటే చిన్నగానో లేదా పెద్దగానో అతడు అర్జున్‌ కపూర్‌ను కొట్టాడు అనేది నిజం అని కొందరు వాదిస్తున్నారు.

Arjun Kapoor slaps by someone